![]() |
![]() |
.webp)
ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి #90s మూవీ టీమ్ నుంచి చైల్డ్ ఆర్టిస్టులతో పాటు హీరో శివాజీ ఎంట్రీ ఇచ్చారు. ఇక స్కిట్స్ కూడా అద్దిరిపోయాయి. ఇందులో ఫైనల్ గా ఇస్మార్ట్ ఇమ్మానుయేల్ కమెడియన్ బాబుతో కలిసి చేసిన స్కిట్ బాగా నవ్వుతెప్పించింది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకుని రావడం అతని ఫాన్స్ అంతా మిగతా హౌస్ మేట్స్ కార్లు పగలగొట్టడం ప్రశాంత్ మీద పోలీసులు కేసు నమోదు చేయడం అన్ని విషయాలు మనకు తెలుసు. ఇప్పుడు ఆ బిట్ నే స్పూఫ్ గా చేసి చూపించారు జబర్దస్త్ కమెడియన్స్.
"జబర్దస్త్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న బాబుకు జై..నాకు లేదు జాబు గెలిచాడు మా బాబు.." అంటూ ఇమ్మానుయేల్ బాబుని ఆకాశానికి లేపేసాడు..ఇక బాబు బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకుని వచ్చాక .."మీరు త్వరగా వెళ్ళండి సర్ ట్రాఫిక్ జామ్ ఐపోతుంది..మీరు వెళ్ళండి" అని పోలీసులు వచ్చి అనేసరికి బాబు తాత్సారం చేసాడు.. "యు ఆర్ అండర్ అరెస్ట్.. అక్కడ నీ ఫాన్స్ అంతా రచ్చ రచ్చ చేసేస్తున్నారు " అంటూ పోలీసు మంచి ఫైర్ తో డైలాగ్ చెప్పేసరికి బాబు ఇప్పుడే వస్తాను అంటూ వాష్ రూమ్ కి వెళ్ళాడు. ఇంతలో ఒక టీవీ రిపోర్టర్ లా వచ్చిన లేడీ కమెడియన్ "ఇప్పుడే అందిన తాజా వార్త బాబు పరారీలో ఉన్నాడు" అంటూ ఒక న్యూస్ చెప్పేసరికి భయపడిన బాబు అక్కడికి వచ్చి "ఓయ్ నేను బాత్ రూమ్ కి వెళ్లాను..పారిపోలేదు " అని చెప్పాడు. ఇక ఈ ఎపిసోడ్ లో గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్ కలిసి సలార్ మూవీ బిట్ ని స్పూఫ్ గా చేసి చూపించారు. ఇలా నెక్స్ట్ వీక్ ఆడియన్స్ ని అలరించడానికి ఎక్స్ట్రా జబర్దస్త్ ఇలా రాబోతోంది.
![]() |
![]() |